ధరూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తంగా పరిస్థితి
JGL: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓ సర్పంచ్ అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, మరో అభ్యర్థి వర్గం ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర దూషణలు చేసుకున్నారు. పోలీసులు కలగజేసుకుని వారిని సర్దిచెప్పారు.