VIDEO: నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
NGKL: వంగూరు మండలంలోని సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని శుక్రవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. సీఎం మాతృమూర్తి రామచంద్రమ్మ జ్ఞాపకార్థం రామ్‌కి స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం సోదరుడు కృష్ణారెడ్డి, గ్రామానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.