యువతి గొంతు కోసిన యువకుడు

యువతి గొంతు కోసిన యువకుడు

కడప జిల్లా ఖాజీపేటలో విషాదం చోటుచేసుకుంది. శ్రీనివాసులు అనే యువకుడు ఓ యువతి గొంతు కోసి హతమార్చిన ఘటన శుక్రవారం జరిగింది. అయితే శ్రీనివాసులుని పెళ్లి చేసుకోలేదని యువతి గొంతు కోశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.