వచ్చే విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవగాహన

వచ్చే విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవగాహన

GDWL: జిల్లాలో అకస్మాత్తుగా వచ్చే విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా శిక్షణ, సూచనలు సలహాలు అమలు చేస్తామని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. శుక్రవారం ఢిల్లీ నుంచి జాతీయ విపత్తు నిర్వహణపై జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.