సునీల్ నరైన్@600

సునీల్ నరైన్@600

వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఫీట్ సాధించాడు. ILT20 లీగ్‌లో షార్జా వారియర్స్‌తో అబుదాబి నైట్‌రైడర్స్ తరఫున ఓ వికెట్ తీసి పొట్టి ఫార్మాట్‌లో 600 వికెట్లు పూర్తిచేసుకున్నాడు.  దీంతో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటికే రషీద్ ఖాన్(681), డ్వేన్ బ్రావో(631) 600 వికెట్ల క్లబ్‌లో ఉన్నారు.