రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

KKD: తాళ్లరేవు మండలం పోలేకుర్రు గ్రామం సంకటరేవు రామాలయం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దర్మరణం చెందాడు. యానాం వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్ తాళ్లరేవు వైపు నుంచి వస్తున్న బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కోరంగి ఎస్ఐ సత్యనారాయణ వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గాడిమొగ వాసిగా గుర్తించారు.