'టెండర్లు పిలవకపోవడం పై విచారణ జరిపించండి'

'టెండర్లు పిలవకపోవడం పై విచారణ జరిపించండి'

అన్నమయ్య: మదనపల్లె దినసరి, వారపు సంత రీ టెండర్లు పిలవకపోవడంపై కౌన్సిల్, అధికారులపై విచారణ జరపాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సీపీఐ నాయకులు మురళి మాట్లాడుతూ.. టెండర్లు పిలవకపోవడంతో మునిసిపాలిటీకి లక్షల్లో నష్టం వచ్చిందన్నారు. వెంటనే రీ టెండర్లను జారీ చేయాలని కోరారు.