వరద బాధితులకు డ్రై రేషన్ సరుకులు పంపిణీ
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు సర్వం కొల్పోయిన బాధితులకు విశ్వ ప్రగామి ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది బాధితులకు సంస్థ డైరెక్టర్ ప్రభుదాసు డ్రై రేషన్ సరుకులు పంపిణీ చేశారు. మనుషులు మానవత్వం కలిగి తోటివారికి సహాయం అందజేయడంలోనే గొప్ప అనుభూతి ఉందని తెలిపారు. చేతనైన సాయం అందించాలని కోరారు.