100 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఆచారం

NZB: జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామంలో శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా చెన్న రాయుడు పల్లకి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారిని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ఈ మహోత్సవం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. 100 ఏళ్లకు పైగా ఈ ఆచారం కొనసాగుతోందని వివరించారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.