ఎమ్మెల్యేను కలిసిన ఖిలా వరంగల్ నూతన MRO

WGL: ఖిలా వరంగల్ నూతన MROగా శ్రీకాంత్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఆయన వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి, పలు విషయాల గురించి చర్చించారు. ఎమ్మెల్యే సైతం ఎమ్మార్వోను శాలువాతో సత్కరించి, పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చేందుకు కృషి చేస్తానని MRO తెలిపారు.