VIDEO: చెరువులో స్నానానికి వెళ్లి వృద్ధుడి మృతి
JGL: పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. కండ్లపల్లి చెరువులో పడి గోగికార్ నర్సోజి(80) మృతి చెందాడు. గణేష్‌నగర్‌కు చెందిన ఆయన స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.