ఎల్ఆర్ఎస్ గడువు మూడో తేదీ వరకు పెంపు

SRD: ప్లాట్ల క్రమబద్దీకరణకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ గడువును ఈనెల మూడవ తేదీ వరకు పెంచుతూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ వస్తుందని చెప్పారు. అవకాశాన్ని ఫ్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.