మూతపడిన బార్‌లకు డ్రా పద్ధతిలో ఎంపిక

HNK: గ్రేటర్ వరంగల్ పరిధిలో గతంలో రెన్యువల్ కాకుండా మిగిలిన నాలుగు 2బీ బార్‌లకు సంబంధించి వచ్చిన 491 దరఖాస్తులను అభ్యర్థుల సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా నాలుగింటిని మంగళవారం సాయంత్రం ఎంపిక చేశారు. కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమక్షంలో నాలుగు బార్‌లకు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య డ్రా తీశారు.