శ్రీకాకుళం ప్రజల కల సాకారం
SKLM: జిల్లాలో రైల్వే పరిపాలనలో కీలక మార్పు చోటుచేసుకుంది. పలాస నుండి ఇచ్ఛాపురం వరకు ఉన్న ఏడు రైల్వే స్టేషన్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే కుర్దా రోడ్ డివిజన్ నుండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం డివిజన్‌కు బదిలీ చేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయని తెలిపారు.