ఝాన్సీ లింగాపూర్‌లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
MDK: రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో JPL-4 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మండల సర్పంచ్‌ల పూర్వం అధ్యక్షులు రామకృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు మహేందర్ రెడ్డి ప్రారంభించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా, క్రీడలపై దృష్టి సారించాలని వారు పిలుపునిచ్చారు.