అమరావతి అనేది CBN ఆశయం: పెమ్మసాని
AP: అమరావతి అనేది చంద్రబాబు ఆశయం, కల, ధ్యేయం అని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. కూటమి ఐక్యతకు కంకణబద్ధుడైన వ్యక్తి.. పవన్ కళ్యాణ్ అని ఆయన కొనియాడారు. అమరావతికి చట్టబద్ధత విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా, నారా లోకేష్‌కు పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి శాశ్వతంగా ఉంటుందా అన్న అనుమానానికి ఈ చట్టసవరణ ముగింపు పలుకుతుందన్నారు.