కూకట్‌పల్లిలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి
HYD: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెట్లకు నీళ్లు పోస్తున్న కార్మికుడిని అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సదరు కార్మికుడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.