గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: డిండి ప్రాజెక్టు వద్ద గంగా హారతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే బాలునాయక్ ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం డిండి రిజర్వాయర్ నుంచి ఆయకట్టు ద్వారా చందంపేట, నేరేడుగొమ్ము మండలాల చెరువులు, కుంటలు నింపేందుకు కామేపల్లి స్టేజ్ వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి నీటిని విడుదల చేశారు.