VIDEO: ఉమెన్స్ కాలేజ్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం

GNTR: గుంటూరు నగరంలో గురువారం కురిసిన భారీ వర్షంతో ప్రభుత్వ ఉమెన్స్ కాలేజ్ వద్ద భారీగా నీరు చేరి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాలేజీ ముగింపు సమయంలో విద్యార్థినులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. వర్షం పడినప్పుడల్లా ఇదే పరిస్థితి ఎదురవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.