రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

MHBD: డోర్నకల్ పట్టణంలోని రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జి సమీపంలో ఇవాళ ఉదయం 6 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు, మరణ కారణం తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.