నేతన్న భరోసా చెక్కులు పంపిణీ చేసిన కలెక్టర్

నేతన్న భరోసా చెక్కులు పంపిణీ చేసిన కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం 151 మంది చేనేత కార్మికులకు రూ.4,56,000 విలువైన నేతన్న భరోసా చెక్కులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి నాణ్యమైన వస్త్రాల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు