సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి: రాజోలు ఎమ్మెల్యే

సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి: రాజోలు ఎమ్మెల్యే

కోనసీమ: రాజోలు నియోజకవర్గంలో జనసేన సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని MLA దేవ వరప్రసాద్ పార్టీ శ్రేణులకు సూచించారు.  బి. సావరం, శివకోటి, రాజోలు, తాటిపాక, పోదలాడ గ్రామాల్లో జరుగుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. సభ్యత్వం ద్వారా కలిగే బీమా, ఇతర ప్రయోజనాలను అభిమానులకు వివరించాలన్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు.