'నూతన కోర్టు భవనం స్థలం కేటాయింపు ప్రక్రియ పూర్తి'

GDWL: గద్వాల అభివృద్ధిలో మరో మైలురాయిగా నూతన జిల్లా కోర్టు సముదాయ నిర్మాణానికి స్థలం ఎంపిక శనివారం పూర్తయింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ తుది ఉత్తర్వులు జారీ చేశారు. పుట్టన్‌పల్లి స్టేజి సమీపంలో కేటాయించిన స్థలాన్ని త్వరితగతిన ఆర్ అండ్ బి అధికారులకు అప్పగించాలని ఆయన ప్రిన్సిపాల్ జిల్లా జడ్జిని కోరారు.