రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
అన్నమయ్య: మదనపల్లె సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నె తండాకు చెందిన మల్లేష్ నాయక్ (33) తీవ్రంగా గాయపడ్డాడు. వ్యక్తిగత పనిపై రాయల్పాడు వెళ్లి తిరిగి వస్తుండగా, చీకిలబైలు గ్రామం వద్ద రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.