మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
RR: మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. పటేల్ చెరువు నుంచి గంగారాం చెరువుకు వెళ్లే నాలను శ్రీ చైతన్య కాలేజీ ఆక్రమించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. స్థానికుల పిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు చెప్పట్టారు. నాలలో మట్టిని నింపి కబ్జా చేసినట్లు హైడ్రా నిర్దారణకు రాగా నాలకు అడ్డుగా ఉన్న మట్టిని జేసీబీలతో తొలగిస్తున్నారు.