జీడీపీ రూ.93,112 కోట్లుగా నమోదయింది: కలెక్టర్
NTR: విజయవాడలో జరిగిన బడ్జెట్ అవుట్‌రీచ్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశా గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024-25 సవరణ అంచనాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో జీడీపీ రూ.93,112 కోట్లుగా నమోదై, రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంచనా ప్రకారం జీడీపీ రూ.1,05,135 కోట్లకు చేరుతుందని తెలిపారు.