ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలంలోని గంగమ్మ దేవాలయ ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు EO శ్రీనివాసులు తెలిపారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి కలిగిన భక్తులు ఈవో కార్యాలయంలో లభించే దరఖాస్తు ఫారాలను తీసుకుని, 20 రోజుల్లోపు పూర్తి వివరాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు.