దారుణం.. మిర్చి నారుపై గడ్డి మందు పిచికారి

దారుణం.. మిర్చి నారుపై గడ్డి మందు పిచికారి

BDK: టేకులపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. దాసుతండాలో బానోత్ శంకర్‌కు చెందిన మిర్చి నారుపై గుర్తు తెలియని దుండగులు గడ్డి మందు పిచికారి చేశారు. దీంతో మిర్చి నారు మొత్తం కాళీ బూడిదైంది. మరో రెండు రోజుల్లో మిర్చి తోట వేసేందుకు ఏర్పాట్లు చేశానని ఇంతలో ఇలా కావడం బాధగా ఉందని బాధిత రైతు కన్నీరుమున్నీరుగా విలపించాడు.