పేలిన ట్యాంకర్.. ఏడుగురికి చేరిన మృతులు

పేలిన ట్యాంకర్.. ఏడుగురికి చేరిన మృతులు

పంజాబ్‌లోని మండియాలాలో ఎల్పీజీ ట్యాంకర్‌ పేలింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య ఏడుగురికి చేరింది. ఈ ఘటనలో మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.