సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా

సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలోని 11వ వార్డు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏరియా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ.. 11వ వార్డులో వీధిదీపాలు వెలగడం లేదని చెప్పారు. మంచినీళ్లు కూడా సరఫరా కావడం లేదని పేర్కొన్నారు.