'ప్రతి ఏటా ఉచిత కంటి వైద్య శిబిరాల ఏర్పాటు'

'ప్రతి ఏటా ఉచిత కంటి వైద్య శిబిరాల ఏర్పాటు'

W.G: తణుకు నియోజకవర్గంలో అంధత్వ నివారణ కోసం ఏడాదికి రెండు లేదా మూడుసార్లు కంటివైద్య శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ సోమవారం తెలిపారు. ఇటీవల తణుకులో నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చిందన్నారు. మొత్తం 600 మందికి కళ్లజోళ్లు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.