సీఎం సహాయనిధి చెక్కులు అందజేత
AKP: అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామానికి చెందిన ముగ్గురికి సీఎం సహాయ నిధి కింద రూ.4,65,800 లక్షలు మంజూరైనట్లు ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. ఇవాళ రెడ్డి నవీన్‌కు రూ.4 లక్షలు, పి.సోమరాజుకు రూ.45,800, ప్రగడ లక్ష్మికి రూ.20,000 చెక్కులను అందజేశారు. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.