జమ్మలమడుగులో మిలాడినబి శాంతియుత ర్యాలీ

జమ్మలమడుగులో మిలాడినబి శాంతియుత ర్యాలీ

KDP: జమ్మలమడుగు పట్టణంలో ఇవాళ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు (మిలాడినబి)సందర్భంగా జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ షా సాధిక్ పాషా ఖాద్రి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమం పట్టణంలోని జామియా మసీదు వద్ద నుండి ప్రారంభమై ప్రధాన రహదారుల వెంట సాగింది.