అనైతిక చర్యలకు ఆరేళ్ల నిషేధం: కలెక్టర్

అనైతిక చర్యలకు ఆరేళ్ల నిషేధం: కలెక్టర్

GDWL: గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో అనైతిక చర్యలకు పాల్పడితే, ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారని కలెక్టర్ సంతోష్ శుక్రవారం హెచ్చరించారు. పదవులను వేలం వేయడం, ఓటర్లను డబ్బు లేదా ఇతర ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు భారత శిక్షాస్మృతి ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లపై ఎవరూ ఒత్తిడి చేయరాదు అని కలెక్టర్ తెలిపారు.