అద్దంకికి రూ. 21.66 కోట్ల నిధులు విడుదల
BPT: అద్దంకి నియోజకవర్గంలో పలు రోడ్ల నిర్మాణానికి రూ. 21.66 కోట్లు పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విడుదల చేయటం అభినందనీయమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం ప్రకటన ద్వారా తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని అన్నారు. తాము గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించామని పేర్కొన్నారు.