ట్రైన్ ఢీకొని అడవి దున్న మృతి

BDK: అశ్వాపురం మండలం జగ్గారం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో దుర్ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి మణుగూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు, రైల్వే ట్రాక్ పైకి వచ్చిన అడవి దున్నను ఢీ కొట్టింది. ఈ ఘటనలో దున్న అక్కడికక్కడే మృతి చెందింది. అధికారుల సమాచారం మేరకు, మృతి చెందిన అడవి దున్న బరువు 4 నుంచి 5 క్వింటాల బరువు ఉంటుందన్నారు.