ఎండీఎంకేకు నాలుగు సీట్లు ఖరారు
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎండీఎంకేకు 4 సీట్లను కేటాయించేందుకు డీఎంకే కూటమి అంగీకారం తెలిపింది. మూడు స్థానాల్లో డీఎంకే గుర్తు అయిన ఉదయ సూర్యుడు గుర్తుతో, ఒక స్థానంలో ఎండీఎంకే తన చిహ్నంతో పోటీ చేయనుంది. ఈ మేరకు సీఎం స్టాలిన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కలిసి సీట్ల సర్దుబాటుపై చర్చించిన తర్వాత ఇరు నేతలకు కలిసి ప్రకటించారు.