గుంతల రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు

గుంతల రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు

ATP: గుత్తి పట్టణంలోని గుంతల రోడ్డుకు శుక్రవారం ఆర్‌అండ్‌బి అధికారులు తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టారు. పట్టణంలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్లు ఏఈ హనీఫ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతలమయం కావడంతో ప్రజల సౌకర్యార్థం ఈ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టామన్నారు.