VIDEO: బైక్ నడుపుతూ కాలువలను పరిశీలించిన మంత్రి
NLG: నల్గొండ మండలం అప్పాజీపేట గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్వయంగా తానే బైక్ నడుపుతూ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి వచ్చే కాలువలను పరిశీలించారు. కాలువల పరిస్థితిని, నీటి ప్రవాహాన్ని సమీక్షించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరాను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.