'ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'
KRNL: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తాలూకా సీఐ నల్లప్ప సూచించారు. ఆదివారం ఎస్సై రామాంజనేయులు సిబ్బందితో కలిసి ఆదోని, ఆస్పరి బైపాస్‌లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.