లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌గా ముజాఫర్ అలీ ఖాన్
MNCL: లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌గా జన్నారం మండలానికి చెందిన ముజాఫర్ అలీ ఖాన్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. లక్షెట్టిపేట మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా సహకరించాలని కోరారు.