పిడుగుపాటుకు బాలుడు మృతి

పిడుగుపాటుకు బాలుడు మృతి

NRML: పిడుగుపాటుకు గురై ఓ బాలుడు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కథనం మేరకు ఎల్వత్‌కు చెందిన మగీర్వాడ్ శ్రీ... రోజు వారిగా మేకలు మేపాడానికి వెళ్లాడు. గురువారం మద్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మేకలు మేపి తిరిగి వస్తుండగా పిడుగు పడి శ్రీ (10) అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.