ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

KMR: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజలకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పనుల జాతర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తిమ్మాజివాడి గ్రామంలో కలెక్టర్ పాల్గొని చాకలి ఎంకవ్వ పశువులషెడ్డు ప్రారంభించడం జరిగింది.