పొగాకు రైతుల సమస్యలపై కేంద్రానికి విన్నపం
E.G: రాజమండ్రి MP దగ్గుపాటి పురందేశ్వరి ఫ్లూ-క్యూర్డ్ వెర్జీనియా పొగాకు రైతుల సమస్యలను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్ దృష్టికి బుధవారం తీసుకువెళ్లారు. జీఎస్టీ విధానంలో ఉన్న లోపాల వల్ల పొగాకు ఉత్పత్తులపై 'పన్నుపై పన్ను' పరిస్థితి ఏర్పడుతోందన్నారు. దీనివల్ల చట్టబద్ధ సిగరెట్ ఉత్పత్తుల ధరలు పెరిగి, అక్రమ సిగరెట్ల వినియోగం పెరుగుతోందని ఆమె తెలిపారు.