బెంగళూరులో రోబోటిక్స్ జోన్: సిద్ధరామయ్య
అసెంబ్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. బెంగళూరులో రోబోటిక్స్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. IISC ఆధ్వర్యంలో ఈ రోబోటిక్స్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇస్రో సహకారంతో రోబోటిక్స్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ జోన్ ఏర్పాటవుతోందన్నారు. రాష్ట్రాన్ని రోబోటిక్స్ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.