VIDEO: శ్రీకాకుళంలో అధ్వానంగా రోడ్ల పరిస్థితి

శ్రీకాకుళంలోని గుజరాతిపేటలో ప్రధాన రోడ్డు అధ్వానంగా తయారైంది. రోడ్డుకు మరమ్మతులు చేసి 2 సంవత్సరాలు కూడా సరిగా పూర్తి కాలేదు. అప్పుడే రోడ్డుపై రాళ్లు తేలి, గుంతలు దర్శనమిస్తున్నాయి. వర్షం పడిన ప్రతీసారి గోతుల్లో వర్షపు నీరు నిలిచి, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. చినుకు పడితే చాలు రోడ్డు ఛిద్రమై రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.