ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

NRPT: నారాయణపేట మండలం పేరపళ్లలో గురువారం మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ జయంతి ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ఆంజనేయులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో హిందూధర్మ పరిరక్షణకు శివాజీ కృషి చేశారని, తన రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేసిన మహోన్నత వ్యక్తి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.