వ్యాన్ బోల్తా.. వ్యక్తి మృతి

VSP: నరసన్నపేట నుంచి విశాఖపట్నం వైపు గోవులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. పాత డైరీ ఫారం వద్ద ఓ వ్యక్తిని వ్యాన్ ఢీకొట్టి బోల్తా పడడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వ్యాన్‌లో ఉన్న కొన్ని గోవులు కూడా ఈ ప్రమాదంలో చనిపోయాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.