VIDEO: అగ్నికి ఆహుతైన లారీ

BDK: లారీ అగ్ని ప్రమాదానికి గురైన ఘటన గురువారం అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో చోటుచేసుకుంది. లారీ నుంచి మంటలు రావడంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటకు దూకేశాడని స్థానికులు అన్నారు. ఎర్రగుంట ఫ్లై ఓవర్‌పై లారీ నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించినట్లు తెలిపారు.