పుస్తకాలు, కిట్స్ సిద్ధం చేయాలి: మంత్రి లోకేష్

AP: పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. DSC పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. టీచర్ల బదిలీల చట్టానికి అనుగుణంగా ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలన్నారు. విద్యార్థుల పుస్తకాలు, కిట్స్ సిద్ధం చేయాలని సూచించారు. విదేశీ విద్య పథకానికి మార్గదర్శకాలు రూపొందించాలని, బాలికల కోసం కలలకు రెక్కలు పేరిట కొత్త పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.